Thursday, May 16, 2024

అదృశ్య‌మ‌వుతున్న శ‌నిగ్ర‌హ వ‌ల‌యాలు…

సౌరమండలంలో శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ ఆ గ్రహానికి ఒక రకమైన శోభను అందిస్తున్నాయి. అలాగే, ఖగోళ శాస్త్రవేత్తలకు ఆ వలయాలు సవా లుగానూ నిలిచాయి. సవాలక్ష రహస్యాల పుట్టలు ఆ వలయాలు. సూదిమొన సైజు నుంచి మహా పర్వతాల పరిమాణంలోని మంచు ఫలకాలు, రాళ్లు, వందల కొలది చిన్నచిన్న ఉపగ్రహాలతో మిళితమైన ఈ వలయాలు నెమ్మదిగా క్షీణిస్తున్నా యని, భవిష్యత్‌లో అదృశ్యమ వుతాయని శాస్త్ర వేత్తలు అంచనావేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ పరిణామం సంభవించకపోయినప్పటికీ… పది కోట్ల సంవత్సరాల తర్వాత అవి ఉండకపోవచ్చని అంచనా వేశారు. అయితే మన దృష్టిలో అది సుదీ ర్ఘ సమయమే. కానీ ఖగోళ విజ్ఞానం, పరిభాషలో అది చాలా స్వల్ప సమయమే. అందుకే ఈ వల యాల అంతర్థానాన్ని క్విక్‌ డెత్‌గా పరిగణిస్తున్నా రు. కొద్ది సంవత్సరాలుగా ఆ వలయాల్లో మంచు శిలలు, ఫలకాలు ఒకదానిని ఒకటి ఢీకొడుతూ క్షీణిస్తున్నాయి. అలా ధ్వంసమైన మంచు వలయా ల్లోంచి గ్రహంపైకి జారిపోతోంది. ఆ వల యాల్లో మంచు రేణులువులు, ఫలకాలు ఎంతకాలం ఒక దానిని ఒకటి అంటిపెట్టుకుని ఉంటాయన్నది చెప్ప లేకపోతున్నారు.


ఆ వలయాలమందం తగ్గుతున్న కొద్దీ అంత ర్థాన సమయం దగ్గరవుతున్నట్లు లెక్క. ఆ వల యాలు అంతర్ధాన ప్రక్రియ గమనం, వేగం, వాటి భవిష్యత్‌ ఏమిటన్న దానిపై ఇప్పుడు ఖగోళ శాస్త్ర వేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ క్షీణ త ఎంత వేగంగా జరుగుతోందన్న దానిపై దృష్టి సారించారు.

సౌరమండలంలో శనిగ్రహం ఆరవది. ఆ గ్రహానికి సుమారు 2 లక్షల 82 వేల కిలోమీటర్ల దూరంలో ఈ ఆకర్షణీయమైన వలయాలున్నా యి. భూగ్రహం నుంచి 1500 కోట్ల కి.మీ. దూరం లో శనిగ్రహం ఉంది. భూమికన్నా తొమ్మిది రెట్ల పెద్దదైన శనిగ్రహం, దాని చుట్టూ ఉండే వలయాల వల్లే ప్రత్యేకంగా కనిపిస్తుంది. శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు ఆ గ్రహం పుట్టుక నుంచి లేవు. కేవలం 10 కోట్ల సంతవ్సరాల క్రితం మాత్రమే ఆ వలయాలు ఏర్పడ్డాయన్నది శాస్త్రవేత్తల అభిప్రా యం. అందువల్ల ఆ వలయాలు శనిగ్రహంలో భాగం కాదన్నది ఖగోళ శాస్త్రవేత్తల్లో అత్యధికుల భావన. మరో పది కోట్ల సంవత్సరాలలో ఈ వల యాలు ఉండకపోవచ్చని భావిస్తున్న శాస్త్రవేత్తలు ఆ పరిణామాన్ని ‘క్విక్‌ డెత్‌’గా పరిగణిస్తున్నారు. ఖగోళ కాలమానం ప్రకారం ఇదేమీ ఎక్కువ కాలం కాదని, మానవజాతిలో మరికొన్ని తరాలకు మాత్ర మే వాటిని చూసే అవకాశం ఉంటుం దని, అది ఒక అదృష్టమని పరిశోధక బృందం సారధి డా. జేమ్స్‌ ఓ డొనొఘ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం డొనోఘ్‌ సారధ్యంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ద్వారా శని వలయా ల్లోనిభౌతిక వ్యవస్థ లోతు పాతులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ వలయాల్లోని మంచు ఫలకా లు ధ్వంసమవడానికి, పర స్పరం ఢీకొట్టుకుని శనిగ్రహంపైకి రాలిపోవడానికి కారణమేమిట న్నదానిపై వారు పరిశోధనలు చేస్తున్నారు.

శని గ్రహానికి 2.82 లక్షల కిలోమీటర్ల దూరం లో మొత్తం ఏడు వలయాలున్నాయి. ఒక దానికి ఒకటి సమీపంగా, అంటిపెట్టుకున్నట్టుం టాయి. వాటికి వరుసగా ఏబీసీడీ క్రమంలో పేరు పెట్టారు. అయితే, ఏ, బీ వలయాల మధ్య దూరం మాత్రం సుమారు 4,700 కి.మీ. ఈ గ్యాప్‌ను కేసిని డివిజన్‌ గా పరిగణిస్తారు. అన్నివలయా ల్లోనూ తోకచుక్క లు, లెక్కలేనన్ని ఉపగ్రహాలు, గ్రహశక లాలు, చీకటి చంద్రళ్లు ఉన్నాయి. శనిగ్రహంచుట్టూ పరిభ్రమించే ప్రయత్నంలో బలమైన గురు త్వాక ర్షణ శక్తి ప్రభా వంతో ముక్కలై ఈ వలయాల్లోకి జారిపోయిన చంద్రుళ్ల భాగాలను చీకటి చంద్రుళ్లుగా పరిగణిస్తా రు. శనిచుట్టూ 83 ఉప్రగ్రహాలున్నాయి. వాటిలో మూడోవంతువాటికి ఇంకా పేర్లు పెట్టలేదు. ఈవల యాల్లో మరికొన్ని వందల చిన్నచిన్న ఉపగ్రహాలు న్నాయి. వాటి లెక్క, పేర్లు ఇంకా నిర్ధారణ కాలేదు. శనిగ్రహపు వలయాల్లోని మంచు కణాలు ఇసుక రేణువుల పరిమాణం నుంచి భారీ భవంతి వరకు ఉంటాయి. మరికొన్ని భారీ పర్వతాల సైజులోనూ ఉంటాయి. ఇంత భారీమంచు రేణువుల సంఖ్య కాస్త తక్కువే. ఇప్పుడు ఇవి ధ్వంసమై వలయా ల్లోంచి రాలిపోతూండటమే సమస్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement