Wednesday, May 1, 2024

IPL | టాస్ నెగ్గిన సంజు శాంసన్.. బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 52వ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ హైదరాబాద్ కెప్టెన్ సంజు శాంసన్ ఐడెన్ మార్క్రామ్ బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు 10 మ్యాచ్ లు, హైద‌రాబాడ్ జట్టు 9 మ్యాచ్ లు ఆడ‌గా.. 5 మ్యాచ్ లు గెలిచి 5 ఓడిపోయిన రాజస్థాన్ పాయింట్స్ టేబుల్ లో నాల్గ‌వ స్థానంలో ఉంది. ఇక 9 మ్యాచ్ లు ఆడిన హైద‌రాబాద్ కేవ‌లం 3 మ్యాచ్ లు మాత్ర‌మే గెలిచి పాయింట్స్ టేబుల్ లో చివ‌ర స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement