Saturday, May 4, 2024

షూటింగ్ లో భారీ పేలుడు – సంజయ్ దత్ కి గాయాలు

సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న కేడి చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా భారీ పేలుడు ప్లాన్ చేశారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ పేలుడు కారణంగా సంజయ్ దత్ చేతులు, ముఖం, భుజం మీద గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సంజయ్ దత్ ని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందజేస్తున్నారు వైద్యులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement