Wednesday, May 1, 2024

అన్ స్టాప‌బుల్ వినోదం..

రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపొం దుతున్న చిత్రం ‘అన్‌ స్టాపబుల్‌’. ”అన్‌ లిమి-టె-డ్‌ ఫన్‌” అన్నది ఉపశీర్షిక. బిగ్‌ బాస్‌ విన్నర్‌ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్నారు. నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లు. రజిత్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ” బేబీ బేబీ… ” పాటని విడుదల చేశారు. ఈ స్పెషల్‌ సాంగ్‌ని భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేశారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా పుష్ప ఫేం ఇంద్రావతి చౌహాన్‌ ఈ పాటని ఆలపించారు.
పాట విడుదల కార్యక్రమంలో విజె సన్నీ మాట్లాడుతూ ” అన్‌స్టాపబుల్‌ ఎంటర్‌-టైన్‌ మెంట్‌ ప్యాకేజ్‌. చాలా మంచి కథ. డైమండ్‌ రత్నబాబు గారు చాలా కష్టపడ్డారు. తప్ప కుండా తగిన ఫలితం దక్కుతుంది. సప్తగిరి అన్న అద్బు éతమైన -టైమింగ్‌ వున్న నటు-డు. ఆయనతో కలసి నటించడం ఆనందంగా వుంది. ” అన్నారు.


సప్తగిరి మాట్లాడుతూ ”అన్‌ స్టాపబుల్‌ అంటే బాలకృష్ణ గారు గుర్తుకు వస్తారు. ఆయన చేసిన ప్రోగ్రాం ప్రపంచ వ్యా ప్తంగా పాపులర్‌ అయ్యింది. ఆ -టైటిల్‌ తో రావడం నిర్మాత రజి త్‌ రావు, దర్శకుడు డైమండ్‌ రత్నబాబు, మాఅందరి అదృ ష్టం. భీమ్స్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు” అని అన్నారు.
నిర్మాత రజిత్‌ రావు మాట్లాడుతూ ”నాకు సినిమా అంటే ఇష్టం. మంచి సినిమా తీయాలనే తపనతో పరిశ్రమకి వచ్చా ను. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా ఇవ్వాలనే పట్టు-దలతో ఈ సినిమా చేశాను.” అని చెప్పారు.
దర్శకుడు డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ ”ఇప్పటి వరకు నన్ను డైమండ్‌ రత్నబాబు అని పిలిచారు. ఈ సినిమా తర్వాత అన్‌ స్టాపబుల్‌ డైరెక్టర్‌ డైమాండ్‌ రత్నబాబు అని పిలుస్తారని ఆశిస్తున్నాను. మా షూటింగ్‌ ఒక వార్‌ లా జరి గింది.” అన్నారు.
విక్రమ్‌, భీమ్స్‌ , సురేష్‌ కొండేటి, బిత్తిరి సత్తి, అక్సాఖాన్‌ తదితరులు ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement