Sunday, May 5, 2024

ప‌ల్లెల్లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ భేష్ : మంత్రి ఎర్ర‌బెల్లి

5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొ్నారు. గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి మొక్క‌లు నాటారు. గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రతను ప‌రిశీలించి, పరిచయం ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళను బయటకు పిలిచి ప‌ల‌క‌రించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ పై గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బందిని అభినందించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో అంశాల వారీగా గ్రామ పరిస్థితులను సమీక్షించిన మంత్రి.. గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? డంపింగ్ యార్డు వినియోగిస్తున్నారా? చెత్త ను ఎరువుగా తయారు చేస్తున్నారా? ట్రాక్టర్, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా స‌మ‌స్య‌లుంటే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement