Tuesday, May 14, 2024

తల్లికి పదవి… కొడుక్కి గన్

నాయకులకే కాదు… వాళ్ళ కొడుకులకు కూడా గన్ మ్యాన్ లు సేవలు చేస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ కూడా తీరు మారట్లేదు. ఇంతకి దీనిగురించి చెబుతున్న అనుకుంటున్నారా!! సంగా రెడ్డి జడ్పీ చైర్మన్ మంజు శ్రీ అధికార దుర్వినియోగం కి పాల్పడుతున్నారు. మంజుశ్రీ కొడుకు జయంత్ రెడ్డి వెనుక కూడా గన్ మ్యాన్ లను ఆమె పంపిస్తున్నారు. ప్రభుత్వం పాలకులకు గన్ మ్యాన్ లను కేటయిస్తే వీరు మాత్రం మొత్తం ఫ్యామిలీ కోసం వాడుకుంటున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు.

గతంలో ఈ విషయంపై జడ్పీ చైర్మన్ కి కలెక్టర్,ఎస్పీ చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం మార్పు రాలేదు. ఇక జయంత్ రెడ్డి గన్ మ్యాన్ లతో వెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement