Friday, April 26, 2024

భారీ ధ‌ర‌కే అమ్ముడుపోయిన శాకుంతలం ఓటీటీ రైట్స్.. ఎంత‌న్న‌ది వెల్ల‌డించ‌ని మేక‌ర్స్‌

సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా శాకుంతలం. ఇక ఈ మూవీ వచ్చే నెలలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మహాభారతంలోని దుష్యంత రాజు, శకుంతల ప్రేమకథ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దే మూవీ యూనిట్ బిజీగా ఉంది. అయితే, ఇటీవల విడుదలైన శాకుంతలం ట్రైలర్ కు యావరేజ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ట్రైలర్ లో డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ సరిగా లేదని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.

అయినప్పటికీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే ఈ సినిమా మంచి క్రేజ్ నే సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం శాకుంతలం సినిమా ఓటీటీ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్ వీడియోస్’ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అయితే దీని గురించి నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక 2015లో వచ్చిన పీరియాడిక్ డ్రామా ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ చేస్తున్న తొలి చిత్రమిది. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో సమంత స్టార్ పవర్, గుణశేఖర్ గ్రాండ్ ఎగ్జిక్యూషన్ పై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సమంత విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి స్పందన వస్తుండటంతో విడుదల వరకు ఇదే జోరు కొనసాగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చే నెల (ఫిబ్రవరి) 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 3డిలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement