Saturday, April 20, 2024

బీమా రంగం రెట్టింపు విస్తరణ, 50 వేల కోట్ల పెట్టుబడులు అవసరం.. ఐఆర్‌డీఏ అంచనా

దేశంలో బీమా రంగం విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో ఇది రెండింతలు విస్తరించేందుకు 50 వేల కోట్ల మూలథన పెట్టుబడి అవసరమని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాదికార సంస్థ (ఐఆర్‌డీఏ) ఛైర్మన్‌ దేబాశిష్‌ పాండా అభిప్రాయపడ్డారు. బీమా సంస్థలతో పాటు, ఇతర వ్యాపార సంస్థలు ఈ రంగానికి పెట్టుబడులు సమకూర్చాలని ఆయన కోరారు. జీవిత బీమా రంగంలో 14 శాతం సాధారణ బీమా విభాగంలో, 16 శాతం వరకు ఈక్విటీపై రాబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. మొదటి 5 కంపెనీల విసయంలో ఇది 20 శాతంం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. బీమా రంగంలో పోటీ చాలా ఉందని, దాదాపు 24 జీవిత బీమా సంస్థలు, 30కిపైగా జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు ఉన్నాయి.

ఇన్ని సంస్థలు ఉన్నప్పటికీ 2020-21 నాటికి బీమా రంగం విస్తృతి 4.2 శాతం మాత్రమే ఉందని ఐఆర్‌డీఏ ఛైర్మన్‌ చెప్పారు. దీన్ని రెట్టింపు చేసేందుకు ఏటా 50 వేల కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయన్నారు. ప్రస్తుత జీడీపీ, వృద్ధి, ద్రవ్యోల్బణం తదితరాలను విశ్లేషించి, ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు మార్చి తరువాత బీమా సంస్థల అధిపతులను కలుస్తాని తెలిపారు. బీమా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న వ్యాపార సంస్థలు, వ్యక్తిగత పెట్టుబడిదారులతోనూ చర్చించనున్నట్లు చెప్పారు.

- Advertisement -

దేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకునే 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఐదు సంవత్సరాల్లో బీమా వ్యాప్తిని రెట్టింపు చేస్తామని విశ్వాసం ఉందని దేబాశిష్‌ పాండా చెప్పారు. ప్రపంచంలో మన దేశ బీమా రంగం 5వ స్థానంలో ఉంది. 2032 నాటికి ఇది ఆరో అతి పెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని ఆయన విశ్లేషించారు. సంప్రదాయ, పాత పథకాలనే కొనసాగించకుండా మారుతున్న అవసరాలకు అనుగుణంగా బీమా పాలసీలను తీసుకుఆవాల్సిందిగా బీమా సంస్థలకు ఆయన సూచించారు. ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసేందుకు కేంద్ర గృహ మంత్రిత్వ శాఖను సంప్రదించాలని బీమా సంస్థలకు కోరారు. బీమా సంస్థలు పాలసీదారుల నుంచి డబ్బు తీసుకోవడంలో పోటీ పడకుండా, విస్తృత పెంచుకోవడం ద్వారా బిజినెస్‌ పెంచుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి బీమా సం స్థలు ప్రత్యేక అధికారిని నియమించుకోవాలన్నారు.

పాలసీదారులకు ద్రవ్యోల్బణ ఇబ్బందుల నుంచి కాపాడేందుకు వీలుగా యాన్యుటీ పాలసీలను రూపొందించాలని పింఛను నిధి నియంత్రణ అభివృద్ధి ప్రాదికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) పూర్తికాల సభ్యుడు మనోజ్‌ ఆనంద్‌ సూచించారు. వచ్చే 5 సంవత్సరాల్లో బీమా సంస్థల యాన్యుటీ పాలసీల్లోకి 11 వేల కోట్లు వస్తాయని పీఎఫ్‌ఆర్‌డీఏ అంచనా వేస్తోందని చెప్పారు. కొత్త పింఛన్‌ పథకం ఈ రంగానికి ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్‌ 31 నాటికి ఎన్‌పీఎస్‌ కింద మొత్తం ఆస్తులు 8.53 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి 9.25 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement