Sunday, May 19, 2024

రష్యన్‌ గూఢచారి కెప్టెన్‌ హతం.. ఇప్పటి వరకు 12 మంది కీలక అధికారులు మృతి

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టాప్‌-సీక్రెట్‌ ఆపరేషన్‌ సమయంలో రష్యన్‌ గూఢచారి కెప్టెన్‌ హతమయ్యాడు. దీంతో ఇప్పటి వరకు 12 మంది కమాండర్లు మరణించారు. సైబీరియాలోని టియుమెన్‌కు చెందిన జిఆర్‌యు మిలటరీ ఇంటెలిజెన్స్‌ గూఢచారి కెప్టెన్‌ అలెక్సీ గ్లుష్‌చాక్‌ (31) మేరియుపోల్‌ మారణహోమంలో మరణించాడు. రష్యాలో గ్లుష్‌చుక్‌ అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలు వెలువడ్డాయి. అక్కడ అతన్ని పూర్తి సైనిక లాంఛనాలతో ఖననం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున భార్యాపిల్లలతో మాట్లాడిన రోజు సాయంత్రమే అతను హత్యకు గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉక్రెయిన్‌పై పుతిన్‌ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 12 మంది కమాండర్లు మరణించారు. మేజర్‌ జనరల్‌ ఆండ్రీ కొలెనస్నికోవ్‌, కల్నల్‌ ఆండ్రీ జఖారోవ్‌, జనరల్‌ విటాలి గెరాసిమోవ్‌తోపాటు మెరైన్‌ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ డిమిత్ర సప్రోనోవ్‌, వైమానిక దళాలకు నాయకత్వం వహించిన డెనిస్‌ గ్లెబోవ్‌, కల్నల్‌ జిజెవ్‌స్క్సీ మరణించారు. ఆండ్రీ సుఖోవెట్నీ కీవ్‌ వెలుపల హోస్టోమెల్‌ పోరాటంలో ఉక్రేనియన్‌ స్నిపర్‌ చేతిలో కాల్చిచంపబడ్డాడు. మరో ఇద్దరు పేరు తెలీని సీనియర్‌ కమాండర్లు కూడా మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement