Friday, April 26, 2024

కరోనా కట్టడికి కొత్త రూల్‌.. ఆ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ తప్పనిసరి

చైనా సహా పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు మళ్లి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఆందోళనల నేపథ్యంలో కొవిడ్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న దేశాలు చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణకొరియా, సింగపూర్‌, థాయిలాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా విదేశాల నుంచి వచ్చే విమానాల్లో 2శాతం మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో రాండమ్‌ కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం… చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు జనవరి 1 నుంచి ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్టు తప్పనిసరి చేసింది.

ఆదేశాల నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో తమ కొవిడ్‌ వైరస్‌ నెగిటివ్‌ నివేదికను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా ఈ పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. అయితే ఇప్పటికే ఎయిర్‌పోర్టుల్లో అమల్లో ఉన్న 2శాతం మందికి రాండమ్‌ పరీక్షల నిబంధన ఇది అదనమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement