Saturday, May 11, 2024

Kruthi: గులాబీ బాల ఈ కృతి స‌న‌న్

మహేష్ బాబుకు జోడీగా ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. తెలుగు లో ఎంట్రీ ఇచ్చినా, కెరీర్ ఆరంభంలో తెలుగు లో సినిమాలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆదిపురుష్ సినిమాతో సీత‌గా న‌టించింది.

అయినా గ్లామ‌ర్ షోకి వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ఇక తాజాగా మరోసారి గులాబి డ్రెస్‌ లుక్ లో అదరగొట్టింది. డ్రెస్ కోడ్‌ గులాబ్‌ అంటూ ఈ ఫోటోలకు కామెంట్‌ పెట్టి కృతి సనన్ ఈ ఫోటోలను షేర్‌ చేసింది. ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం. మరోసారి ఈమె లుక్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అందాల గులాబి కి నెటిజన్స్ అదరహో అంటూ కితాబిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement