Tuesday, May 21, 2024

అచ్చం మాన‌వ చ‌ర్మంతో ఉండే రోబోలు.. కొత్త ప్ర‌యోగాలు చేప‌డుతున్న సైంటిస్టులు!

నేటి టెక్నో స‌మాజంలో రోబోల ఆవ‌శ్య‌క‌త రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఎన్నో విధాలా ఉప‌యోగ‌ప‌డే రోబోల‌ను త‌యారు చేస్తున్నారు సైంటిస్టులు. అయితే ఆ రోబోల‌ను అచ్చు హ్యూమ‌న్స్‌లా ఉండేలా చేయాల‌ని య‌త్నిస్తున్నారు కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు. త్వ‌ర‌లో రోబోట్‌లు మానవ కణాల నుండి పెరిగిన సజీవ చర్మంతో క‌నిపించ‌నున్నాయంటున్నారు. అవి కూడా మనలాగే ఉండ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న రోబోలు.. నర్సులు, కేర్ వర్కర్ల‌గా ఉప‌యోగిస్తుంన్నందున‌.. వాటిని మరింత నిజ‌మైన మ‌నిషిలా కనిపించేలా చేయడం చాలా ముఖ్యం అని అభిప్ర‌యాపడుతున్నారు జ‌పాన్ కు చెందిన టోక్యో విశ్వవిద్యాలయంలో సైంటిస్టు షోజి టేకుచి అత‌ని బృందం.

ప్రస్తుతానికి ఉన్న‌ రోబోట్‌లకు సిలికాన్ రబ్బర్‌తో కండకలిగిన రూపాన్ని సృష్టిస్తున్నారు.. అయితే రబ్బరు మానవ చర్మం ఆకృతిని కలిగి ఉండదు.. ఆ రోబోలకు మరింత మాన‌వ రూపం కనిపించేలా చర్మాన్ని తయారు చేసేందుకు టేకుచి అతని టీమ్ ఓ ప్రాజెక్ట్ చేప‌ట్టారు. మూడు రోజుల పాటు ఫైబ్రోబ్లాస్ట్‌లు అని పిలువబడే కొల్లాజెన్, మానవ చర్మ కణాల సూప్‌లో ప్లాస్టిక్ రోబోట్ వేలిని ఉంచారు. అయితే వాళ్లు గ‌మ‌నించింది ఏమంటే కొల్లాజెన్, ఫైబ్రోబ్లాస్ట్‌లు ఆ రోబో వేలికి అంటిపెట్టుకుని ఉండి.. మానవ చర్మంపై నుండి రెండో పొర అయిన చర్మాన్ని పోలిన పొరను ఏర్పరుచుకున్నాయి.

ఆ తర్వాత వారు ఎపిడెర్మిస్ అని పిలువబడే మానవ చర్మం పైపొరను క్రియేట్ చేయడానికి కెరాటినోసైట్స్ అనే వేరే మానవ చర్మ కణాలను వేలుపై సున్నితంగా పూశారు. ఫలితంగా 1.5-మిల్లీమీటర్ల మందపాటి చర్మం వేలుపై ఏర్ప‌డింది.. ఇది సిలికాన్ ర‌బ్బ‌ర్ కంటే చాలా వాస్తవమైనది. అయినప్పటికీ.. చర్మం తేమతో నింపడానికి రక్త నాళాలు లేనందున కొంతకాలం తర్వాత పొడిబారడం గ‌మ‌నించారు. ఇక‌.. భవిష్యత్తులో చర్మాన్ని తేమగా ఉంచడానికి కృత్రిమ రక్తనాళాలను చేర్చడం సాధ్యమవుతుందని దాని కోసం కొన్ని ప‌రిశోధ‌న‌లు చేస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మెలనోసైట్‌లను యాడ్ చేయ‌డం ద్వారా వివిధ చర్మ రంగులను తయారు చేయడం కూడా ఈజీగా ఉంటుంద‌ని చెప్పారు. అలాగే స్వేద గ్రంథులు, వెంట్రుకల కుదుళ్లను మరింత వాస్తవికంగా మార్చడం కూడా సాద్య‌మేన‌ని టేకుచి చెప్పారు.

ఇక‌.. పరిశోధకులు ఇప్పుడు మొత్తం రోబోట్‌ను సజీవ చర్మంతో చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ, ఈ పరిశోధనా రంగం మ‌నిషుల‌కు, రోబోట్‌ల మధ్య కొత్త సంబంధాన్ని క్రియెట్ చేపే అవ‌కాశం ఉంది. రోబోల‌ను వాస్తవికంగా చేయడం వల్ల కలిగే నష్టాలు, ప్రయోజనాలను జాగ్రత్తగా పరిగణించాల్సి ఉండి అని టేకుచి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement