Thursday, May 9, 2024

రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్

పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ లో వెల్లడించారు. ఎవరో కొవిడ్ పేషెంట్ తో కాంటాక్ట్ అయి ఉంటానని, దీంతో తనకూ పాజిటివ్ వచ్చిందని అన్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం తాను, కరోనా నెగెటివ్ వచ్చినా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయామన్నారు. దీంతో ప్రియాంక గాంధీ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. అన్ని పర్యటనలు, ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన భర్తకు పాజిటివ్ రావడంతో తాను కూడా టెస్ట్ చేయించుకున్నానని, నెగెటివ్ వచ్చిందని ఆమె చెప్పారు ప్రియాంక.

Advertisement

తాజా వార్తలు

Advertisement