Friday, April 26, 2024

రోడ్డు క్లీన్ చేసిన అషూరెడ్డి – నెగిటీవ్ కామెంట్స్ చేస్తోన్న నెటిజ‌న్స్

అషూరెడ్డి సోష‌ల్ మీడియాలో నిత్యం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుందీ బ్యూటీ. కాగా స్వ‌చ్ఛ భార‌త్ లో భాగంగా త‌మ ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల‌ను చీపురుతో క్లీన్ చేసింది. ఈ మేర‌కు ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోలను చూసిన పలువురు నెటిజన్లు అషురెడ్డిపై కామెంట్ల చేస్తున్నారు. తన గ్లామర్ కు ఫిదా అయిన వాళ్లే… అషురెడ్డి ఎక్స్ పర్ మెంట్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. తను పోస్ట్ చేసిన ఫొటోల్లో పరిసరాలను క్లీన్ చేసి అలిసిపోనట్టుగా రెండు ఫొటోలను అప్ లోడ్ చేసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు మరీ ఎక్కువైనట్టు లేదా అంటున్నారు. ఫొటోలను పోస్ట్ చేసి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ రెండు ఫొటోల గురించి నన్ను అడగొద్దు అని కోరింది. కానీ ఆమె ఊహించినట్టే నెటిజన్ల నుంచి నెగటివ్ కామెంట్లు వచ్చాయి. ఏదేమైనా తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది అషురెడ్డి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement