Sunday, May 5, 2024

అమెరికాలోని బోస్టన్‌లో రోడ్డు ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి విశ్వచంద్‌ మృతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలోని బోస్టన్‌ విమానాశ్రయంలో కొల్లా విశ్వచంద్‌ దుర్మరణం పాలయ్యాడు. యూఎస్‌లోని బోస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండగా బస్సు వచ్చి ఢీకొట్టడంతో ఆయన మరణించాడు. 47 ఏళ్ల భారతీయ-అమెరికన్‌ విశ్వచంద్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. కొల్లా తాకేడ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో ఉద్యోగి అయిన ఆయన మార్చి 28న బోస్టన్‌లోని లోగాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విజిటింగ్‌ సంగీతకారుడిని పికప్‌ చేసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్వచంద్‌ కొల్లా సాయంత్రం 5 గంటలకు స్నేహితుడిని పికప్‌ చేసుకోవడానికి టెర్మినల్‌ బి దిగువ స్థాయిలో ఉండగా అతన్ని ఒక బస్సు ఢీకొట్టిందని మసాచుసెట్స్‌ స్టేట్‌ పోలీసులు తెలిపారు. డ్యూటీలో లేని నర్సు కొల్లాకు సహాయం చేయడానికి పరుగెత్తారు.

అయితే అతను సంఘటనా స్థలంలోనే మరణించారు. ట్రూపర్లు బస్సు డ్రైవర్‌, 54 ఏళ్ల మహిళను ఇంటర్వ్యూ చేసి, బస్సును తనిఖీ చేశారు. విచారణలో ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని నివేదిక పేర్కొంది. ప్రయాణికులను వెంటనే బస్సు నుంచి దించి, వారి లగేజీని విమానాశ్రయంలోని మరో భాగానికి తరలించారు. లోగాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ జరిగిన సంఘటనలో బాధితులైన ప్రతి ఒక్కరికీ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని డార్ట్‌మౌత్‌ కోచ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తాము మరింత సమాచారాన్ని సేకరించేందుకు మసాచుసెట్స్‌ స్టేట్‌ పోలీస్‌, మాస్‌పోర్ట్‌తో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. టకేడాలోని గ్లోబల్‌ కంపెనీ ఆంకాలజీ విభాగంలో కొల్లా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement