Saturday, May 4, 2024

ఇన్ కార్ … అంద‌రూ చూడాల్సిన సినిమా

జాతీయ అవార్డు గ్రహీత, ‘గురు’ సినిమా ఫేమ్‌ రితిక సింగ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన -కై-మ్‌ థ్రిల్లర్‌ ‘ఇన్‌ కార్‌’. అంజుమ్‌ ఖురేషి, సాజిద్‌ ఖురేషి నిర్మిసున్నారు. హర్షవర్ధన్‌ దర్శకుడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌ గోయత్‌, మనీష్‌ ఝంజోలియా, జ్ఞాన్‌ ప్రకాష్‌ కీలక పాత్రధారులు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ‘ఇన్‌కార్‌’ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్‌ మీడియా సమావేశం నిర్వహించింది.


రితిక సింగ్‌ మాట్లాడుతూ ”ఇన్‌ కార్‌ చాలా సీరియస్‌, కంప్లీట్‌ రా ఫిల్మ్‌. చాలా భావోద్వేగానికి గురి చేసిన పాత్ర . చివరి క్షణం వరకూ పోరాడే పాత్ర . అందరూ చూడాల్సిన సినిమా ఇది. దురదృష్టవశాత్తు అత్యాచారంకు సంబంధించిన వార్తలు హెడ్‌ లైన్స్‌ లో రోజూ చూస్తుంటాం. ఎలాంటి పరిస్థితులు ఇలాంటి దారుణమైన సంఘటనలకు దారితీస్తాయనేది ఇందులో చూపించాం. చాలా ముఖ్యమైన టాపిక్‌ ఇది. ఈ కథ విన్నప్పుడే నటనకు ఆస్కారం వుండే పాత్ర చేయబోతున్నానని అర్ధమైయింది. దాదాపు షూటింగ్‌ కార్‌ లో చేశాం. చివర్లో ఒక గొప్ప హోప్‌ ని ఇస్తుంది. అందరూ ‘ఇన్‌ కార్‌’ ని తప్పకుండా చూడాలి” అన్నారు. దర్శకుడు హర్ష వర్ధన్‌ మాట్లాడుతూ ”ఇన్‌ కార్‌ ఒక థ్రిల్లర్‌. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. అత్యాచారం వార్త హెడ్‌ లైన్స్‌ లోకి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు వుంటాయి? కొందరు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారు? వాళ్ళ మనస్తత్వం ఎలా ఎలా వుంటు-ంది ? అనే అంశాలని చూపించాలానే ఆలోచనతో ఇన్‌ కార్‌ రూపొందించాం. రితిక సింగ్‌ అద్భుతంగా నటించారు. ఇది ఒక సవాల్‌ తో కూడుకున్న పాత్ర. ఈ సినిమా కోసం దాదాపు 32 రోజుల పాటు- ఆమె తలస్నానం చేయకుండా ఒకే డ్రెస్‌ తో వున్నారు. చాలా అంకితభావంతో నటించారు. ” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement