Thursday, May 2, 2024

ఆస‌క్తినిరేకెత్తిస్తోన్న.. భువ‌న విజ‌యం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

పోస్ట‌ర్ తోనే ఆస‌క్తిని రేపారు భువ‌న విజ‌యం చిత్రం మేక‌ర్స్. క్రైం కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రాన్ని యలమంద చరణ్‌ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. తెల్ల లుంగీ, థిక్‌ బ్లూ షర్ట్‌లో ఉన్న హీరో సునీల్ ఛైర్‌పై సీరియస్‌ లుక్‌లో కనిపిస్తుండగా.. పక్కనే పృథ్విరాజ్‌ కంప్లీట్‌ వైట్‌ డ్రెస్‌లో కనిపిస్తున్నారు. మరోవైపు వెన్నెల కిశోర్‌ తన స్టైల్‌లో కొంచెం సీరియస్‌ యాంగిల్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృథ్వి, ధన్‌ రాజ్‌, వెన్నెల కిశోర్, శ్రీనివాస్‌ రెడ్డి, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్‌ బ్యానర్‌పై కిరణ్‌, వీఎస్‌కే తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement