Saturday, May 4, 2024

పెరుగుతున్న కరోనా కేసులు, 24 గంటల్లో 3వేల మందికి పాజిటివ్‌

దేశంలో కరోనా మహమ్మారి మళ్లి విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లిలో రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ఢిల్లిలో ఆరు రోజులుగా.. 1000కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లి ప్రభుతం.. కరోనా కట్టడికి ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వ్యక్తులపై రూ.500 జరిమానా విధిస్తున్నది. అలాగే మార్కెట్‌ ప్రాంతాల్లోని వ్యాపారులు అంతా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని కోరింది. రాజధాని ఢిల్లిలో ఇప్పటి వరకు 18,78,458 మంది కరోనా బారినపడగా.. మరణాల సంఖ్య 26,170లకు చేరింది. తాజాగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. పాజిటివ్‌ రేటు 4.50 శాతంగా ఉందని వైద్య అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 17వేలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 4.73లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 3,377 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోలిస్తే.. కొత్త కేసుల సంఖ్య సల్పంగానే పెరిగినప్పటికీ.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతానికి చేరడం గమనార్హం.

17వేలకు పెరిగిన యాక్టివ్‌ కేసులు

దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 2496 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.74 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 17,801 కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్‌ కేసుల రేటు 0.04 శాతంగా ఉంది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5.23 లక్షలకు చేరుకుంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. 24 గంటల్లో 22.80 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు 188.65 కోట్ల డోసులు పంపిణీ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement