Saturday, December 7, 2024

RIP : జగదీష్ పాడె మోసిన మంత్రి సత్యవతి.. ఘ‌నంగా నివాళుల‌ర్పించిన మంత్రుల బృందం..

ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ భౌతిక కాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంతిమ యాత్రలో వారు పాల్గొన్నారు. జ‌గ‌దీష్ అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్న మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ పాడె మోశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement