Friday, April 26, 2024

సిట్ విచార‌ణ‌కు రేవంత్.. కాంగ్రెస్ నేత‌ల ముంద‌స్తు అరెస్ట్..

సిట్ విచార‌ణ‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, మల్లు రవి, సీనియర్ నేత వీహెచ్‌, బల్మూరి వెంకట్ ను పోలీసులు ముంద‌స్తు హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో మంత్రి కేటీర్ పీఏ తిరుపతి హస్తం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. రేవంత్ సిట్ విచార‌ణ నేప‌థ్యంలో హైదరాబాద్‌లోని సిట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement