Saturday, April 27, 2024

‘ఆంధ్రప్రభ’ కథనాలకు స్పందన.. ఖాకీ బకాసురుల కేసులో అరెస్టులు..

వరంగల్ క్రైమ్ జులై 31 (ప్రభ న్యూస్) : హన్మకొండ జిల్లా కేంద్రంగా సాగుతున్న భూ కబ్జాలు, ఆక్రమణలు, సెటిల్మెంట్స్ పై ఆంధ్రప్రభ వరస కథనాలపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు స్పందించారు. భూ దందాలు, ఖాకీ బకాసురుడు, రౌడీ లాఠీ రుబాబ్ శీర్షికలతో ఆంధ్రప్రభ ఉమ్మడి వరంగల్ జిల్లా టాబ్లెయిడ్ లో బ్యానర్ ఐటమ్స్ గా ప్రచురితమైన కథనాలపై సీరియస్ గా స్పందించారు. కాకతీయ యూనివర్సిటీ, హసన్ పర్తి పోలీస్ స్టేషనలలో కేసులు నమోదు చేశారు. కెయు పోలీసులు శనివారం రాత్రి 10 మంది నిందితుల్లో 6 గురిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారు. కేసులో ప్రధాన సూత్రధారులైన నలుగురు పరారీలో ఉన్నారు. కేయు ఇన్స్ పెక్టర్ దయాకర్ అందించిన వివరాల ప్రకారం భూకబ్జాలకు పాల్పడుతున్న 10మందిపై కేసు నమోదు చేశారు. ఏ 1 గా ముద్దసాని వేణుగోపాల్ (గ్యాంగ్ స్టార్) ఏ 2 గా ఆర్ ఐ సంపత్ కుమార్ లుగా చేర్చారు.

వీరితో పాటు ఏ 3 గా మాజీ ఎం పి పి మల్లన్న, ఏ 1 వేణుగోపాల్ డ్రైవర్ క్రాంతి లను ఏ 10 లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన ఏ 4 కెత్తేపాక రమేష్ అలియాస్ మిల్క్ రమేష్ (35), ఏ 5 గా హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి వాసి బొజ్జ హరిబాబు (27, ప్రస్తుతం భీమారం గణేష్ నగర్), ఏ 6 గా శాయంపేట మండలం కొప్పుల వాసి అలువాల నరేష్ (28, ప్రస్తుతం హన్మకొండ, గోకుల్ నగర్), ఏ 7 గా హసన్ పర్తి సిద్దాపూర్ కు చెందిన మేకల రమేష్ (42, ప్రస్తుతం గోపాల్ పూర్), ఏ 8 గా హసన్ పర్తి మండలం పెంబర్తికి చెందిన పంగా రవి (40), ఏ 9 గా భీమారంకు చెందిన టిఫుల్ ప్రవీణ్ (32) లు అరెస్టు చేసిన ఉన్నారు. అరెస్ట్ చేసిన వారి నుండి పర్చ్యునర్ వెహికిల్ ,రెండు తల్వార్లు, ఒక డమ్మీ పిస్టల్ లను స్వాధీనం చేసుకున్నట్లు కేయు సిఐ దయాకర్ తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం రెండు సెక్షన్లపై నమోదు చేసిన్నప్పటికి, ఫిర్యాదుల మేరకు అదనపు సెక్షన్లపై కూడ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement