Wednesday, May 1, 2024

గోదావరి కళకళ… కృష్ణమ్మ వెలవెల!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వర్షాకాలం ప్రారంభమై నెల గడిచినా ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాలకు జీవనాధరమైన కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలశయాలకు చుక్క వరద నీరు కూడా రావడం లేదు. అదేసమయంలో ఎగువన కర్ణాటకలోని కృష్ణా నదిపై, ఉపనది తుంగభద్రపై ఉన్న జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు అలమట్టి, ఉజ్జయినీ, తుంగభద్ర ప్రాజెక్టులకు 70వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కర్ణాటకలోని అలమట్టి పూర్తి సామర్థ్యం 129 .72 టీఎంసీలకు గాను 65.75 టీఎంసీలు, నారాయణపూర్‌ 37.64 టీఎంసీలకు గాను 32 టీఎంసీలు, తుంగభద్ర 100.86 టీఎంసీలకు గాను 64.73 టీఎంసీలు, ఉజ్జయిని ప్రాజెక్టు 117.24 టీఎంసీలకుగాను 56.32 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ నిండితేగాని శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా… 43.82 టీఎంసీలు నీరు మాత్రమే ఉంది. ఇక నాగార్జునసాగర్‌లో 312.05 టీఎంసీలకుగాను 116.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

గోదావరి ప్రాజెక్టులకు జలకళ…

మహారాష్ట్రతోపాటు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కడెం, ఎల్లంపల్లి, సింగూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి 92,700 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా… ఔట్‌ఫ్లో 92, 720 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి మట్టం 5.80టీఎంసీలుగా నమోదైంది. అటు సరస్వతి (అన్నారం) బ్యారేజీలోని 8 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారెజీకి 7,900 క్యూసెక్కులు వరద కొనసాగుతుండగా. ..ఔట్‌ఫ్లో 10, 800 క్యూసెక్కులుగా నమోదైంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10,87 టీఎంసీలు ఉండగా… ప్రస్తుతం 6.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద పోటు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి భారీగా వరdద నీరు వచ్చిచేరుతోంది. అధికారులు 6 గేట్లు ఎత్తి 56వే99ల ిక్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. రిజర్వాయర్‌ నీటి మట్టం 407 అడుగులు కాగా… ప్రస్తుతం 404.40 అడుగులకు నీటి మట్టం చేరింది. చఎ్టా పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో కిన్నెరసాని అవతలి వైపు ఉన్న 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద..

కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర బరాజ్‌కు వరద పోటెత్తుతోంది. జలాశయంలోకి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం 82, 103 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా… 221 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర పూర్తి సామర్థ్యం 105. 788 టీఎంసీలు కాగా… నీటి నిల్వ 64.728 కి చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement