Wednesday, May 1, 2024

సీజ్‌ చేసిన వివో ఫోన్ల విడుదల.. ఎగుమతి చేసుకునేందుకు అనుమతి

నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు వివో స్మార్ట్‌ పోన్లను విమానాశ్రయంలోనే సీజ్‌ చేసిన అధికారులు వాటిని విడుదల చేశారు. 27 వేల మొబైల్‌ ఫోన్లను అధికారులు సీజ్‌ చేశారు. రెండు వారాలుగా అధికారులు వాటిని ఢిల్లి ఎయిర్‌పోర్టులో తమ అధీనంలో పెట్టుకున్నారు. ఆర్ధిక శాఖకు చెందిన రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు అన్ని వివరాలను క్షుణంగా పరిశీలించిన తరువాత ఈ ఫోన్లను ఎగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అధికారులు ప్రతి ఫోన్‌ ఐఎంఇ నెంబర్‌ను చెక్‌ చేశారు. దీని వల్ల 15 మిలియన్‌ డాలర్ల విలువైన ఈ ఫోన్టలో చాలా ఫోన్టు దెబ్బతియాన్నాయని వివోకు చెందిన ఒక అధికారి తెలిపారు.
వివో కంపెనీ ఫోన్ల విలువను తక్కువ చూపించిందని, మోడల్స్‌ వివరాల్లోనూ తప్పులు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు వీటి ఎగుమతిని అడ్డుకున్నారు. మన దేశంలో తయారైన వివో స్మార్ట్‌ ఫోన్లను పొరుగు దేశాలకు కంపెనీ ఎగుమతి చేస్తోంది. తనిఖీ చేసేందుకు ప్రతి ప్యాక్‌ను ఓపెన్‌ చేయడం వల్ల ఈ ఫోన్లు ఎగుమతికి పనికి రావవని కంపెనీ తెలిపింది.

పరిశ్రమ వర్గాలు మాత్రం ఇలా ఫోన్లను సీజ్‌ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. డీఆర్‌ఐ అధికారుల చర్య ఏకపక్షంగా, అసంబద్దంగా ఉందని విమర్శించింది. ఇలాంటి చర్యల వల్ల ఎగుమతి హబ్‌గా మారాలన్న మన దేశ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించింది. చైనా, ఇండియా మధ్య సరిహద్దు వివాదంతో మన దేశంలోని చైనా కంపెనీల పట్ల అధికారులు తీరులో మార్పుు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని అధికారులు సోదాలు, తనిఖీలు చేస్తున్నారని ఈ వర్గాలు విమర్శిస్తున్నాయి. రాజకీయ కారణాలతో ఇలా చేయడం తగదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

- Advertisement -

2026 మార్చి నాటికి మే దేశం నుంచి 120 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇలా ఎగుమతి చేస్తున్న వాటిని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలిపి వేయడం వల్ల మంచి సంకేతాలు పంపించదని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. వివో స్మార్ట్‌ ఫోన్లను మన దేశం నుంచి సౌదీ అరేబియా, థాయిలాండ్‌ దేశాలకు వీటిని ఎగుమతి చేసేందుకు ప్రయత్నిం చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement