Wednesday, May 15, 2024

CAT admit card | రేపే ‘క్యాట్‌’ అడ్మిట్‌ కార్డుల విడుదల.. 26న పరీక్ష

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ ప్రవేశాల కోసం తలపెట్టిన క్యాట్‌ పరీక్ష హాల్‌టికెట్లు రేపు (మంగ‌ళ‌వారం) విడుదలకానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కోసం ఈ సంవత్సరం క్యాట్‌ పరీక్ష (సిఎటి 2023)కు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలై దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది.

క్యాట్‌ పరీక్షలు ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన హల్‌టికెట్లు రేపు ఐఐఎం-లక్నో విడుదల చేయనుంది. క్యాట్‌ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. క్యాట్‌-2023 పరీక్షను ఐఐఎం-లక్నో నిర్వహించనుంది.

క్యాట్‌ పరీక్షా విధానం..

- Advertisement -

క్యాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా కీలకమైన మూడు దశలుంటాయి. గత ఏడాది పరీక్ష ప్రకారం చూస్తే. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుండి 24 ప్రశ్నలు, లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుండి 20 ప్రశ్నలు, క్వాంటిటేటీవ్‌ ఎబిలిటి నుండి 22 ప్రశ్నలు ఉంటాయి.

మొత్తం 66 ప్రశ్నలు 198 మార్కులతో ప్రశ్నప్రత్రం ఉంటు-ంది. పరీక్ష సమయం 2 గంటలు. ఇప్పుడు కూడా ఇదే పద్దతిలో నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి సెక్షన్‌ వ్యవధి 40 నిమిషాలు. పరీక్ష మొత్తం వ్యవధి 2 గంటలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

ఐఐఎం క్యాంపస్‌ల జాబితా ఇదే..

క్యాట్‌ 2023 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్‌, బెంగళూరు, కలకత్తా, జమ్మూ, బోద్‌ గయ, ఉదయపూర్‌, తిరుచిరాపల్లి, కోజికోడ్‌, అమృత్‌సర్‌, రాయ్‌పూర్‌, నాగ్‌పూర్‌, కాశీపూర్‌, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్‌, షిల్లాంగ్‌, ఇండోర్‌, సంబాల్‌పూర్‌, సిర్‌మౌర్‌ ఐఐఎం తదితర క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement