Friday, April 26, 2024

తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. అక్టోబర్‌ నెలలో 6.77 శాతంగా నమోదు

రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో 6.77 శాతానికి తగ్గింది. సెప్టెంబర్‌ నెలలో ఇది 7.41 శాతంగా నమోదైంది. సోమవారం నాడు ప్రభుత్వం ద్రవ్యోల్బణం వివరాలను విడుదల చేసింది. 4-6 శాతం లోపుగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ పెట్టుకున్న లక్ష్యానికంటే ఇది ఇంకా ఎక్కువగానే ఉంది. ఇలా ఆర్బీఐ టార్గెట్‌ కంటే అధికంగా ద్రవ్యోల్బణం నమోదు కావడం వరసగా ఇది 10వ నెల. వినియోగదారుల ధరల ఇండెక్స్‌(సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం జనవరి నుంచి 6 శాతానికి పైగానే నమోదవుతూ వస్తోంది.

ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.01 శాతంగా నమోదైంది. ఇది సెప్టెంబర్‌ నెలలో 8.6 శాతంగా ఉంది. మరో వైపు పరిశ్రమ శాఖ హోల్‌సేల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వివరాలను వెల్లడించింది. ఇది 19 నెలల కనిష్టానికి తగ్గింది. అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ సూచీ 8.39 శాతంగా నమోదైంది. 2021 మార్చిలో హోల్‌సేల్‌ ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 7.89 శాతంగా నమోదైం ది. మళ్లిd 18 నెలల తరువాత తక్కువగా 8.39 నమోదు అయ్యింది. ఇంధనం, తయారీ వస్తువుల జధరలు తగ్గడంమే ఇందుకు కారణమని పేర్కొంది.

- Advertisement -

ఖనిజ, చమురు, ప్రాధమిక లోహాలు, లోహ ఉత్పత్తులు, వస్త్రాలు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణం తక్కువ నమోదు కావడానికి కారణమని పరిశ్రమల, వాణిజ్య శాఖ తెలిపింది. సప్టెంబర్‌లో 11.03గా ఉన్న ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం 8.03 శాతానికి తగ్గింది. కూరగాయల ద్రవ్యోల్బణం 39.66 శాతం నుంచి 17.61 శాతానికి తగ్గింది. ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి, తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 4.42 శాతానికి తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement