Thursday, April 25, 2024

ఎన్నికల బాండ్లపై విచారణకు సుప్రీం సమ్మతి.. అక్ర‌మాల‌కు చోటు ఉండ‌ద‌ని వాద‌న‌లు

ఎన్నికల బాండ్ల ప థకం సవరణపై పిటిషన్‌ను వి చారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఈ బాండ్ల విక్రయానికి గడువును మరో పదిహేను రోజులు పొడిగించేందుకు ప్రభుత్వం ఈ సవరణ చేసింది.ఎన్నికల బాండ్ల విక్రయ పథకం వల్ల అవినీతి అక్రమాలు జరుగుతాయని కాంగ్రెస్‌ నాయకుడు జయ ఠాకూర్‌ తన పిటిషన్‌లో వాదించారు.అయితే, ఇది అలాంటి అక్రమాలకు తావు ఇవ్వదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు.ఈ అంశాన్ని విచారణ జరిపే అంశాల జాబితాలో చేరుస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్ర చూడ్‌ తెలిపారు. ఈబాండ్ల విక్రయాల గడువును పొడిగిస్తూ నవంబర్‌ 7వ తేదీన కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement