Saturday, April 27, 2024

తగ్గిన విమాన ఇంథన ధరలు..

న్యూఢిల్లి : విమాన ఇంథన రేట్లను 2.2 శాతం తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో ఈ చర్య తీసుకున్నారు. విమాన ఇంథన ధరలను కిలో లీటర్‌కు 3,084.94 రూపాయలు తగ్గించారు. దీంతో ఈ రేటు 138147.93 రూపాయలకు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి.

ఈ సంవత్సరంలో ఇలా తగ్గించడం రెండోసారి, గత నెలలో వీటి ధరలు కిలోలీటర్‌కు 14123.87 రూపాయలు ఉంది. ఈ రేటు లీటర్‌కు 141.23 రూపాయలు గా ఉంది. విమాన ఇంథన రేట్లను ప్రతి నెల 1వ తేదీ, 16వ తేదీల్లో అంతర్జాతీయ మార్కెట్‌ రేట్ల ప్రకారం సవరిస్తారు. పెట్రోల్‌, డిజీల్‌ , గ్యాస్‌ రేట్లను మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా సవరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement