Monday, May 6, 2024

హెచ్‌డిఎఫ్‌సీ లాభం 9,195.99 కోట్లు..

ముంబాయి : ప్రముఖ ప్రయివేట్‌ బ్యాంక్‌ హెచ్‌డిఎఫ్‌సీ మొదటి త్రైమాసికంలో నికర లాభంలో 19 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం 9,195.99 కోట్లు సాధించింది. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో బ్యాంక్‌ 2,984 కోట్ల పన్ను చెల్లించింది. గతత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం 7,729.64 కోట్లు. జనవరి- మార్చి త్రైమాసికంలో వచ్చిన నికర లాభం 10,055 కోట్లతో పోల్చితే ఈ త్రైమాసికంలో నికర లాభం తగ్గింది. పన్ను చెల్లించడానికి ముందు ఆపరేటింగ్‌ లాభాలు 15,055.88 కోట్లుగా ఉందని బ్యాంక్‌ తెలిపింది.

బ్యాంక్‌ వడ్డీ ఆదాయం 22.5 శాతం పెరిగింది. బ్యాంక్‌ మొత్తం బిజినెస్‌ 21,09,772 కోట్లు. బ్యాంక్‌ డిపాజిట్లు 1,604760 కోట్లు. ఇది గతం కంటే 19.2 శాతం అధికం. కరెంట్‌ అకౌంట్‌ సేవింగ్స్‌ డిపాజిట్లు 20.1 శాతం పెరిగి, 5,14,063 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్‌ మొత్తం రుణాలు 13,95,068 కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ రిటైల్‌ రుణాలు 21.7 శాతం పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల రుణాలు 28.9 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ నిర్ధరక ఆస్తులు 1.28 శాతంగా ఉన్నాయి. గతం కంటే ఇవి స్వల్పంగా తగ్గాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement