Saturday, May 4, 2024

ఎరుపు రంగుతో న‌దిలో నీటి ప్ర‌వాహం … బేజారెత్తుతున్న జ‌నం

టోక్యో – నది ఎరుపు రంగులో నీటి ప్ర‌వాహం కొన‌సాగుతున్న‌ది.. అప్ప‌టి వ‌ర‌కు స్వ‌చ్చ‌మైన నీరు ఉన్న న‌దిలో వాట‌ర్ ఒక్క‌సారిగా మార‌డంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన జపాన్ లోని ఒకినావా నాగో సిటీలోని ఓడరేవు వద్ద జరిగింది. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఒక రసాయనం కారణంగా ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. ఇది సురక్షితమైనదేనని, ఈ రసాయనాన్ని కాస్మెటిక్‌ పరిశ్రమలో వియోగిస్తారని చెప్పారు.

ఓరియన్‌ బ్రూవరీ కంపెనీ ఫుడ్‌ కలరింగ్‌ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపింది. తమ ఫ్యాక్టరీని చల్లబరిచే ప్రక్రియకు సంబంధించి ఆహార భద్రత చట్టాల నిబంధనలో జాబితాలో ఉందని వివరణ ఇచ్చింది. ప్రొపైలిన్‌ గ్లైకాల్‌ అనే రసాయంన లీకేజ్‌ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని తెలిపింది. . ఈ మేరకు బీర్‌ కంపెనీ ప్రెసిడెంట్ హజిమ్ మురానో మాట్లాడుతూ .ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే గాక ఈ లీక్‌ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement