Saturday, May 4, 2024

రంజీ ఫైనల్స్‌.. మధ్యప్రదేశ్‌ 123/1 – ముంబై 374

రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌, ముంబయి జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ జట్టు ఒక వికెట్‌ కోల్పోయి 123 పరుగులు చేసింది. ఆ జట్టులోని శుభమ్‌ శర్మ44, యశ్‌ దూబే 41 పరుగులతో రాణించి క్రీజ్‌లో ఉండగా మధ్యప్రదేశ్‌ జట్టు పటిష్ఠ స్థితిలో ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రంజీ ఫైనల్స్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌ జట్టులోని బ్యాట్స్‌మన్‌ హిమాంశు మంత్రిని తుషార్‌ దేశ్‌పాండే త్వరగా ఔట్‌ చేయగలిగినా శుభమ్‌, యశ్‌ నిలకడగా ఆడారు.

అంతకుముందు ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది. ఆ జట్టులోని సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుతంగా ఆడి సెంచరీ (199 బంతుల్లో 134 పరుగులు) నమోదు చేశాడు. ఈ సీజన్‌లో సర్ఫరాజ్‌కు ఇది నాల్గవ సెంచరీ కావడం విశేషం. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో సర్ఫరాజ్‌కు ఇది ఎనిమిదవ సెంచరీ. రంజీ ట్రోఫీ మొదలైనప్పటినుంచి సర్ఫరాజ్‌ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement