Wednesday, April 24, 2024

ఫిఫా ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్‌ నెంబర్‌ 1

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్‌ తొలి స్థానాన్ని నిలుపుకుంది. బెల్జియం రెండో స్థానంలో నిలవగా ఇంగ్లండ్‌, స్పెయిన్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, పోర్‌ుల్‌, డెన్మార్క్‌ తొలి పది స్థానాల్లో నిలిచాయి. రెండు స్థానాలు మెరుగు పరుచుకున్న అర్జెంటీనా మూడో స్థానంలో నిలవగా యూఈఎఫ్‌ఏ నేషన్స్‌ లీగ్‌ పోటీల్లో నాలుగు ఓటములతో ఫ్రాన్స్‌ 4వ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. కాగా భారత్‌ ఈసారి తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఆసియన్‌ కప్‌ పోటీల్లో అద్భుతంగా రాణించడంతో ఫిఫా ర్యాంకింగ్‌ టేబుల్‌ల రెండు స్థానాలు పైకి ఎగబాకి 104 స్థానంలో నిలిచింది. ఫిఫా ర్యాంకింగ్‌ టేబుల్‌ను గురువారం విడుదల చేశారు.

న్యూడిలాండ్‌ జట్టు మనకన్నా ఒక స్థానం పైన (103) నిలిచింది. ఈనెల తొలివారంలో జరిగిన ఖండాంతర ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో కోస్టారికాపై 0-1 తేడాతో ఓడిపోవడంతో ఫిఫా-2022 వరల్డ్‌ కప్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆసియన్‌ ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ సభ్యదేశాల్లో భారత్‌ 19వ స్థానంలో కొనసాగుతుండగా ఇరాన్‌ అగ్రస్థానంలో ఉంది. ఇటీవల జరిగిన ఆసియన్‌ కప్‌ ఫుట్‌బాల్‌ అర్హత పోటీల్లో సునీల్‌ ఛత్రి సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రతిభ కనబరచింది. గ్రూప్‌ డిలోని మొత్తం మూడు లీగ్‌ మ్యాచ్‌లలోను నెగ్గి పైనల్‌ పోటీలకు అర్హత సాధించింది. వచ్చే ఏడాది జరగనున్న టోర్నీలో మొత్తం 24 జట్లు పాల్గొనబోతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement