Friday, May 3, 2024

చేయి అందించిన ర‌ణ్ వీర్.. ప‌ట్టించుకోని దీపిక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొణే చేయి పట్టుకుని నడిచేందుకు హీరో రణవీర్ సింగ్ ఆసక్తి చూపించారు.ముందుగా కారు దిగి వచ్చిన రణవీర్ రెడ్ కార్పెట్ పై దీపిక కోసం వేచి చూశారు. దీపిక వచ్చిన తర్వాత చేయి చాచినప్పటికీ.. దాన్ని చూడనట్టుగానే దీపిక పదుకొణె ముందుకు అడుగులు వేసింది. దీంతో రణవీర్ సింగ్ చేసేదేమీ లేక చేయి కిందకు దించేసి ముందుకు సాగిపోయారు. ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ నాలుగో ఎడిషన్ కార్యక్రమం ముంబైలో జరిగింది. దీనిలో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది..వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ కార్యక్రమానికి ముందు వారి మధ్య ఫైటింగ్ జరిగి ఉండొచ్చని ఓ యూజర్ కామెంట్ చేయడం గమనించొచ్చు. దీపిక తన చర్య ద్వారా రణవీర్ ను అగౌరవ పరిచిందని.. రణవీర్ కంటే తానే పెద్ద స్టార్ అనే భావన ఆమెలో ఉందని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో క్లిప్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement