Sunday, April 28, 2024

రామారావు ఆన్ డ్యూటీ – రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టిస్తోన్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కథానాయికగా నటించగా, మరో కథానాయికగా రజీషా విజయన్ అలరించనుంది. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. కాగా వచ్చేనెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ అధికారిక పోస్టర్ ని రిలీజ్ చేశారు.

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆయన పాత్ర చాలా కీలకమైనదట‌. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. సామ్ సీఎస్ స్వరపరిచిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో రవితేజ ఉన్నాడు. నాజర్ .. నరేశ్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement