Saturday, April 27, 2024

అద్భుత‌మైన క్ష‌ణాలివి…

మెగా పవర్‌స్టార్‌ యు.ఎస్‌లో సందడి చేస్తున్నారు. ఇటీవలే ఆయన గుడ్‌ మార్నింగ్‌ అమెరికా షోతో పాటు ఏబీ సీ న్యూస్‌ వాళ్లు నిర్వ#హంచిన ఇంటర్వ్యూస్‌లో పాల్గొన్న రామ్‌ చరణ్‌ ఇప్పుడు లాస్‌ ఏంజిల్స్‌ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు. యు.ఎస్‌లో ఇప్పుడందరూ చరణ్‌ను గ్లోబల్‌ స్టార్‌ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్‌ ఏంజిల్ల్సోని పాపులర్‌ ఎంటర్‌టైన్మెంట్‌ చానెల్‌ కేటీఎల్‌ఏ రామ్‌ చరణ్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మేకింగ్‌ సమయంలో జరిగిన మ్యాజిక్‌ గురించి ‘నాటు నాటు..’ సాంగ్‌ తెరకె క్కించేటప్పుడు కలిగిన ఎక్స్‌పీరియెన్స్‌ గురించి రామ్‌ చరణ్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి ప్రపంచ వ్యాప్తంగా పేరు రావటంపై మీ స్పందన?
రాజమౌళిగారు రాసిన అత్యుత్తమ చిత్రాల్లో ఆర్‌ఆర్‌ ఆర్‌ ఒకటి. ఇందులో చాలా జోనర్స్‌ మిళితమై ఉన్నాయి. డ్రామా, ఇద్దరి #హరోల మధ్య ఉన్న సోదర అనుబంధాన్ని ఎలివేట్‌ చేసిన తీరు అన్నీ చక్కగా కలిశాయి. ఇది అల్లూరి, భీమ్‌ అనే ఇద్దరి కుర్రాళ్ల మధ్య ఉండే స్నేహాన్ని తెలియజేస్తూనే, భారతదేశం ఎదుర్కొన్న వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి కూడా తెలియజేసిం ది. ఈ ఎలిమెంట్స్‌ అన్నీ పలు రకాలు పలువురి సెంటిమెం ట్స్‌ను టచ్‌ చేసింది.
‘నాటు నాటు’ పాటను చేసే క్రమంలో మీలో అది ఉత్సా హాన్ని నింపిందా?
నేనెప్పుడూ చిన్నపిల్లాడిలా డాన్స్‌ చేయలేదు. నాకు నిర్మాత మంచి రెమ్యూనరేషన్‌ను ఇచ్చారు. కాబట్టి నేను తప్పకుండా డాన్స్‌ చేయాల్సిందే. ‘నాటు నాటు’ అనేది చాలా అందమైన సాంగ్స్‌లో ఒకటి.


ఆస్కార్‌ వేడుకల్లో లైవ్‌ పెర్ఫామెన్స్‌ గురించి తెలి యచేయండి?
ఇప్పటికీ వరకు ప్రేక్షకులు మాకు చాలానే ఇచ్చారు. పాటను ఆస్కార్‌ వేడుకల్లో లైవ్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకులకు నా ప్రేమను చూపించడం అనేది ఓ మార్గం. అలా చేయటం నేను వారికిచ్చే రిటర్న్‌ గిప్ట్‌n.
”నాటు నాటు” సాంగ్‌ ఆస్కార్‌కి ఎంపిక కావటం ఎలా అనిపిస్తుంది?
నా జీవితంలో ఇవి అద్భుతమైన క్షణాలు. ఆస్కార్‌ వేడు కల్లో నేను ఓ అతిథిగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు నామి నేట్‌ అయ్యాను. నేను ఆ బ్లాక్‌ లేడీని మా టీమ్‌తో కలిసి మా దేశానికి తీసుకెళ్లటానికి చాలా ఎగ్జయిట్మెంట్‌తో ఎదురు చూస్తున్నాను.
ఆస్కార్‌ రేసులో మీ పాట ఉండటంపై మీరెలా భావిస్తున్నారు?
ఓ నటుడిగా అది నాకెంతో సంతృప్తిని కలిగించే క్షణాలు. మా ఇండియన్‌ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమకు 85 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు మీరు మమ్మల్ని గుర్తించారు. మా సినిమా ఎంతో బాగుందని అప్రిషియేట్‌ చేశారు. నేను వివిధ దేశాల్లో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో మా మార్క్‌ చూపించటానికి ఇదే సరైన తరుణంగా భావిస్తున్నాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement