Thursday, May 2, 2024

జూన్‌లో వానలు సాధారణం కంటే తక్కువే.. వెల్లడించిన ఐఎండీ

జూన్‌లో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మొత్తం సీజన్‌లో సాధారణ రుతుపవనాలను అంచనా వేసే సమయంలో ఈ మేరకు పేర్కొంది. ఐఎండీ ఎన్విరాన్‌మెంట్‌ మానిటరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌చీఫ్‌ డి శివానంద పాయ్‌ మాట్లాడుతూ, ”దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, వాయువ్య భారతదేశం, ఉత్తర భారతదేశంతోపాటు కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణ నెలవారీ (జూన్‌) కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. భూమధ్యరేఖ పసిఫిక్‌ మహాసముద్రం వేడెక్కడం వల్ల ఎల్‌నినో ఏర్పడినప్పటికీ ఈ సీజన్‌లో నైరుతి రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశంలోని చాలా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలతో కూడిన రుతుపవనాల కోర్‌ జోన్‌లో కాలానుగుణ వర్షపాతం చాలా సాధారణం దీర్ఘకాల సగటులో 94 నుండి 106 శాతం వరకు ఉంటుందని పాయ్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement