Thursday, May 9, 2024

Breaking: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరబాద్​లో ఇవ్వాల (శనివారం) రాత్రి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చిరుజల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీగా వాన పడుతున్నట్టు సమాచారం అందుతోంది. హైదరాబాద్​లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఐడీపీఎల్‌, సూరారం కాలనీల్లో వర్షం పడింది. చింతల్‌, గండిమైసమ్మ, కొంపల్లి, సుచిత్ర, అల్వాల్‌, బొల్లారం, కౌకూర్‌, యాప్రాల్‌, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడలోనూ మోస్తరు జల్లులు కురిశాయి. వాన రావడంతో వాహనదారులు తడవకుండా ఉండేందుకు ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. ఇప్పటికే వర్షానికి సంబంధించి జీహెచ్​ఎంసీ అధికారులు మెస్సేజ్​ ద్వారా అలర్ట్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement