Sunday, April 28, 2024

తెలంగాణకు వ‌ర్ష సూచ‌న‌… రానున్న రెండు రోజుల్లో వాన‌లు !

తెలంగాణ‌లో రానున్న మ‌రో మూడురోజుల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఆగ్నేయ ద్వీప‌కల్ప దిక్కున శని‌వారం నుంచి ఈశాన్య రుతు‌ప‌వ‌నాల వర్షాలు ప్రారం‌భ‌మయ్యే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. దీని ప్రభా‌వంతో రాష్ట్రంలో ఉష్ణో‌గ్రతలు తగ్గు‌తా‌యని, ఈ నెల 31, నవం‌బర్‌ 1న పలు చోట్ల వర్షాలు కుర‌వ‌వ‌చ్చని పేర్కొ‌న్నది. 1న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహ‌బూ‌బా‌బాద్‌, వరం‌గల్‌, హను‌మ‌కొండ, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, వన‌పర్తి, నారా‌య‌ణ‌పేట, జోగు‌లాంబ గద్వాల, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల్లో వర్షం కురిసే అవ‌కాశం ఉన్నదని తెలి‌పింది. రాత్రి ఉష్ణో‌గ్రతలు 15 జిల్లాల్లో సాధా‌రణం కంటే తక్కు‌వగా నమో‌దు‌కాగా, అత్యల్పంగా కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా సిర్పూ‌ర్ ‌(‌యు)లో 12.5 డిగ్రీలు నమో‌దై‌నట్టు వివ‌రిం‌చింది. రాగల మూడు రోజుల్లో హైద‌రా‌బాద్‌ మినహా అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణో‌గ్రతలు తగ్గవ‌చ్చని టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ తెలి‌పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement