Wednesday, May 8, 2024

Rain Alert : నేడు తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌…

తెలంగాణ భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతార‌ణ కేంద్రం వెల్ల‌డించింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీచేసింది. రుతుపవనాల ప్రభావానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 7 నుంచి 9 మధ్య భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement