Thursday, May 2, 2024

రాధే శ్యామ్ ట్రైల‌ర్ అప్ డేట్.. అనౌన్స్ చేసిన మేక‌ర్స్..

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా.. రాధా కృష్ణ కుమార్ దర్శక‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. ప్ర‌భాస్ కి జంట‌గా పూజా హెగ్డే న‌టించింన ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కానుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ ఈ సినిమా రిలీజ్ గురించి మేక‌ర్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో కొన్ని పెద్ద ఈవెంట్‌లు కూడా ప్లాన్ చేసారు మేక‌ర్స్..

అందులో భాగంగా మార్చి 2న ‘రాధే శ్యామ్’ నుంచి కొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసారు. మార్చి 2 మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాధేశ్యామ్ కొత్త ట్రైల‌ర్ విడుద‌ల కానుంది సాధ్యమైనంత గొప్పగా ప్రేమను సెల‌బ్రేట్ చేసుకుందాం.. అంటూ సోష‌ల్ మీడియా అకౌంట్స్ వేదిక‌గా అనౌన్స్ చేసారు మేక‌ర్స్

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement