Thursday, May 2, 2024

గురుకులాల్లో నాణ్యమైన విద్య : మంత్రి సత్యవతి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. గిరిజన బిడ్డలకు విద్యతో వికాసం వస్తుందని నమ్మిన సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 183 గురుకుల విద్యా సంస్థలను అభివృద్ధి చేశామన్నారు. గురుకులాల్లో విద్యనభ్యసించిన 991 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ చదువుతున్నారని ఆమె తెలిపారు. గిరిజన గురుకులాలు, ఏకలవ్య మోడల్‌ స్కూల్‌, ఆశ్రమ పాఠశాలలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో గురుకుల సొసైటీ ఉద్యోగులు, సంఘాలు నాయకుల సమావేశంలో మంత్రి సత్యవతి పాల్గొని మాట్లాడారు.. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల చొప్పున సాయం అందజేస్తున్నామని ఆమె తెలిపారు. రాజేంద్రనగర్‌లో ఉన్న ఐఐటీ, జేఈఈ, ఎంసెట్‌ కోచింగ్‌ సెంటర్‌ తరహాలో ఖమ్మం, పరిగి, హాయత్‌నగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో కొత్త కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement