Monday, May 13, 2024

Puttaparthi – గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు

శ్రీ సత్యసాయి బ్యూరో నవంబర్ 12 :(ప్రభన్యూస్) శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాత్రి కిడ్నాప్ గురైన చిన్నారి కేసును గంటల వ్యవధిలోని పోలీసులు చేదించారు . దీంతో చిన్నారిని సురక్షితంగా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ వివరాలను ఆదివారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. పుట్టపర్తి లోని మోర్ సూపర్ బజార్ సమీపంలో ఆడుకుంటున్న లక్షిత 5 ఐదేళ్ల చిన్నారిని సాయికుమార్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. చాక్లెట్,టపాసులు కొనిస్తానని పాపను తీసుకెళ్ళాడు. పాప కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు గిరి నాయక్, అరుణాబాయి పలుచోట్ల గాలించి భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో చిన్నారి కేశను ఎస్పీ సీరియస్గా తీసుకోవడంతో , పుట్టపర్తి డి.ఎస్.పి వాసుదేవన్ ఆధ్వర్యంలో, సిఐ కొండారెడ్డి ఎస్ఐ వీరేశులు కేసు ఛాలెంజ్ గా తీసుకొని సీసీటీవీ పుటేజి ఆధారంగా స్థానిక యువకులు,పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిండితుడు దిక్కు తెలియక చిన్నారిని ప్రశాంతి నిలయం సమీపంలో వదిలిపెట్టి వెళ్లారు. తెల్లవారు జామున పాపను గుర్తించిన పోలీసులు చిన్నారిని సురక్షితంగా తీసుకొచ్చారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. .ఈ సందర్భంగా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారి కిడ్నాప్ కు గురైందని తెలిసిన వెంటనే పోలీసులను రెండు జిల్లాలలో అలెర్ట్ చేశామని, దీనికి తోడు యువకులు, స్థానిక పోలీసుల సాయంతో పట్టణంలో అణువణువునా గాలింపు చర్యలు చేపట్టి చిన్నారిని సురక్షితంగా పట్టుకోగలిగామని ఎస్పీ వెల్లడించారు. .

తల్లిదండ్రులు పిల్లల పట్ల అశ్రద్ద వహించవద్దని పిల్లలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలని ఎస్పి సూచించారు.చిన్నారిని కాపాడేందుకు సహకరించిన యువకులను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ఈ చిన్నారి కేసులో చాకచక్కంగా వ్యవహరించి న డి.ఎస్.పి వాసుదేవన్ ,సిఐ కొండారెడ్డి ఎస్ఐ వీరేష్ పోలీసులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అభినందించారు..

తమ పాప తప్పిపోయిన వెంటనే సీసి పుటేజి ద్వారా పాప కిడ్నాప్ కి గురైందని గుర్తించామని తప్పిపోయిన తమ పాపను స్థానికుల తో పాటు పోలీసులు రాత్రి అంతా గాలించి పాప ను రక్షించి తమకు అప్పగించినందుకు ఎస్పీ కి ,పోలిసులకు , యువకులకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement