Sunday, April 28, 2024

పుష్ప సినిమా రిలీజ్ : థియేటర్ ల వద్ద ఫ్యాన్స్ సంబరాలు

నేడు పాన్ ఇండియా చిత్రం పుష్ప రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించాడు. దాంతో థియేటర్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో, సినిమా కూడా అదే స్థాయిలో సూపర్ హిట్ అవుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోణ కారణంగా రెండు సంవత్సరాలుగా సినిమా థియేటర్ లో చూడక ఎంతో నిరాశతో ఉన్న ప్రేక్షకులకు ఈ రోజు ఇంత పెద్ద సినిమా రిలీజ్ కావడం పండుగ వాతావరణాన్ని నెలకొంది. ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. హైదరాబాద్ అంబర్ పేట్ శ్రీరమణ సినిమా థియేటర్ వద్ద అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని కూడా ధీమా వ్య‌క్తం చేశారు. పుష్ప‌ సినిమాకు 5 ఆటలు ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు .తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను .ఈ సంబరాల్లో కిట్టు,డి.జే సాయి ,నందికంటి శివ, జే.సిద్ది రాములు,వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement