Sunday, April 28, 2024

భూగర్భ జలాల వృద్ధి పై పంజాబు అధ్యయనం.. రాష్ట్రానికి రానున్న పంజాబు ప్రతినిధిబందం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని జలవనరుల అభివృద్ధి దేశానికి ఆదర్శమవుతుంది. నీటిని పొదుపుగా వాడుకంటూ రిజర్వాయర్లు, చెక్‌ డ్యాంలు, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పై దేశంలోని అనేక రాష్ట్రాలు తెలంగాణపై దృష్టి సారించాయి. ఇటీవల పంజాబు ముఖ్యమంత్రి భగత్‌ సింగ్‌ మాన్‌ రాష్ట్రంలో ని జలవనరులను పరిశీలించి ప్రశంసించడంతో తెలంగాణపై దేశం దృష్టి మళ్లింది. ఒకప్పుడు బీడుభూములుగా ఉన్న పాలమూరు పచ్చబడటంతో పంజాబులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతినిధిబృందం మంగళవారం హైదరాబాద్‌ చేరుకుని మూడురోజులపాటు తెలంగాణ జలవిధానం-వ్యసాయరంగాభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారని ఈ ఎన్సీ మురళీ ధర్‌ రావుతెలిపారు.

పంజాబు ముఖ్యమంత్రి భగత్‌ సింగ్‌ మాన్‌ ఆదేశాలమేరకు పంజాబు ప్రతినిధిబృందం రాష్ట్రంలో పర్యటించి నివేదిక రూపొందించనుంది. ఇందులో ప్రధానంగా మిషన్‌ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువులు, చెక్‌ డ్యాంలు, భూగర్భ జలాల రీచార్జింగ్‌ పరిశీలించనున్నారు. ఈ మేరకు పంజాబు ప్రతినిధి బృందానికి గజ్వెల్‌ ఇంజనీరింగ్‌ చీప్‌ హరిరాం, భూగర్భ జలాశాఖ సంచాలకుడు పండిత్‌ మధూరే సహకరించాలని ఈఎన్సీ మురళీధర్‌ ఆదేశించారు.

- Advertisement -

మంగళవారం ఈ ప్రతినిధిబృందం హైదరాబాద్‌ కు చేరుకుని రోడ్డుమార్గం ద్వారా సిద్ధిపేట జిల్లాలో మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా పునర్‌ అభివృద్ధి చెందిన చెరువులను అధ్యయనం చేయనున్నారు. అనంతరం రంగనాయక సాగర్‌ చెరును అధ్యయనంచేసి అక్కడే బసచేస్తారు. అతర్వాత రెండురోజులపాటు రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌ చెరువులు,రిజర్వాయర్ల నిర్మాణాలు, వ్యవసాయ విధానాలను పరిశీలిస్తారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై మార్చి మూడవతేదీన తిరిగి పంజాబువెళ్ళనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement