Monday, April 29, 2024

Psycho – క‌త్తితో యువ‌కుడి దాడి – 12 మందికి గాయాలు…

ఫ్రాన్స్‌లోని ఆల్పైన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు ప్రజలపై కత్తితో దాడి చేశాడు..విచక్షణారహితంగా జరిపిన ఈ దాడిలో ఆరుగురు చిన్నారులు సహా 12 మందికి గాయాలయ్యాయి. దుండగుడి దాడిలో గాయపడ్డ చిన్నారులు దాదాపు మూడేళ్ల వారేనని, వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. గురువారం ఉదయం ఓ పార్కులో ఈ దాడి జరిగింది. .నిందితుడిని అరెస్టు చేశారు. అతడు సిరియాకు చెందిన శరణార్థుడిగా గుర్తించారు.. అన్నేసి సిటీలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు…

కాగా, నిందితుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై శరవేగంగా విచారణ జరుపుతున్నామని ఫ్రాన్స్ మంత్రి గెరాల్డ్ డార్మానిన్ చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement