Thursday, April 25, 2024

అది ఫేక్ పోస్ట‌ర్.. తిరుప‌తి పోలీసులు

స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆది పురుష్ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ పోస్ట‌ర్ పై తిరుపతి పోలీసులు స్పందించారు. ఆ పోస్టర్ ఫేక్ అని స్పష్టం చేశారు. రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం… ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియటర్లలో దళితులకు ప్రవేశం లేదు… హిందువులందరం తప్పక వీక్షిద్దాం అన్నదే ఆ పోస్టర్ సారాంశం. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తిరుపతి పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ పోస్టర్ లోని అంశాలను ఆదిపురుష్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు తిరస్కరించాయని, ఇలాంటి వార్తలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆ పోస్టర్ లో పేర్కొన్నది వాస్తవం కాదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement