Monday, April 29, 2024

ద్రవ్యోల్బణం నుంచి ప్రజలను రక్షించండి.. కేంద్రానికి రాహుల్‌ సూచన

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలను రక్షించాలని విజ్ఞప్తిచేశారు. అంతర్జాతీయ విపణిలో బ్యారల్‌ ముడిచమురు ధరలు 100డాలర్లకుపైగా చేరుకున్నందున, ఆహార ధరలు 22శాతం పెరగవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కాకముందే రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల నమోదైంది. అప్పటికే పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపించాయి. రాబోయే రోజుల్లో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా చైన్‌కు కొవిడ్‌ అంతరాయం కలిగించిందన్న ఆయన.. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా తక్షణం చర్యలు తీసుకొని ప్రజలను రక్షించాలని ట్వీట్‌ చేశారు. గత శనివారం ద్రవ్యోల్బణం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రావిడెంట్‌ ఫండ్లపై వడ్డీ రేటును తగ్గించడంపై కేంద్రంపై రాహుల్‌ ఫైర్‌ అయ్యారు. కేంద్రం తప్పుడు విధానాల పరిణామాలను సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎఫ్‌డీ 5.1శాతం, పీపీఎఫ్‌ 7.1శాతం, ఈపీఎఫ్‌ 8.1శాతం.. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.07శాతం తగ్గించారని, టోకు ద్రవ్యోల్బణం 13.11శాతం పెరిగిందని, ప్రజలకు ఉపశమనం కలిగించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అంటూ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement