Tuesday, April 30, 2024

ఓయూ ప్రొఫెసర్లకు పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ చేసిన ఉస్మానియా వర్సిటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రొఫెసర్లకు సీనియర్లుగా పదోన్నతులు కల్పిస్తూ తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పదేళ్లకు పైగా ప్రొఫెసర్లుగా పనిచేసిన అనుభవంతో పాటు పరిశోధన అనుభవం ఆధారంగా ఈ పదోన్నతులకు ఎంపిక చేశారు. సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన 26 మంది సీనియర్‌ ప్రొఫెసర్ల జాబితాను ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదించింది. ఉస్మానియా వర్సిటీ ప్రకటించిన జాబితాలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి కూడా ఉన్నారు.

సీనియర్‌ర్లుగా పదోన్నతులు పొందిన 26 మంది ప్రొఫెసర్లు వర్సిటీ వీసీ ప్రొ.డి.రవీందర్‌ చేతుల మీదుగా మంగళవారం పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. అత్యధికంగా ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 8 మంది పదోన్నతులు పొందారు. ఆ తర్వాత బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కామర్స్‌ విభాగం నుంచి నలుగురు చొప్పున, ఇంగ్లీష్‌ విభాగం నుంచి ఇద్దరు, ఎడ్యుకేషన్‌ నుంచి మరో ఇద్దరు పొందారు. తెలుగు నుంచి ఒకరు, వ్యాయామ విద్యా, ఫిజిక్స్‌, టెక్నాలజీ, జువాలజీ విభాగం నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి పదోన్నతి పొందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement