Saturday, May 4, 2024

ఇకపై అలాంటి ఆడ్స్ కి నో ప‌ర్మిష‌న్..

న్యూఢిల్లి: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్రోత్సహించే ప్రకటనలపై నిషేధం విధిస్తూ సమాచార మంత్రిత్వ శాఖ సోమవారం మార్గదర్శకాలు జారి చేసింది. వినియోగదారులకు ఇవి సామాజికార్థిక ముప్పుగా పరిణమిస్తున్నందుకు ఈ తరహా ప్రకటనలను నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వేదికలకు సంబంధించిన ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియాలను కేంద్రం కోరింది. పలు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌, ఆన్‌లైన్‌ మీడియాలో పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వెబ్‌ సైట్స్‌, ప్లాట్‌ ఫాంల గురించిన ప్రకటనలు వెలువెత్తిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మార్గ దర్శకాలను జారీ చేసింది.

బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, దేశంలో ని పలు ప్రాంతాల్లో చట్ట విరుద్దమైనవిగా పరిగణిస్తారని, వీటిపై ప్రకటనలు ముఖ్యంగా చిన్నారులు, యువతకు సామాజార్థిక ముప్పుగా పరిగణించాయని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రకటించింది. నిషేధిత కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌ యాడ్స్‌ ఉన్నాయని వాఖ్యానించింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇవి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019కి విరుద్దమని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను కాపాడే క్రమంలో ఆన్‌లైన్‌ బెట్టిం గ్‌పై తాజా మార్గదర్శకాలను జారీ చేశామని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement