Monday, April 29, 2024

కొవిడ్‌ వేరియంట్స్‌ను గుర్తించడంలో పురోగతి.. యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సరికొత్త ఆవిష్కరణ

కోవిడ్‌ వేరియంట్స్‌ను గుర్తించడంలో అమెరికా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. గంటల వ్యవధిలోనే ఏ రకమైన వేరియంట్‌ అనేది కచ్చితంగా చెప్పగలిగే పరీక్ష ఇది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (యుటి) సౌత్‌ వెస్ట్రన్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు నాలుగు వేల కంటే ఎక్కువ మంది నుండి సేకరించిన నమూనాలపై పరీక్షించారు. ఈ పరిశోధన అమెరికా పత్రికల్లో ప్రచురింపబడింది. ”ఈ పరీక్షను ఉపయోగించి సమాజంలో ఎన్ని వేరియంట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంతే కాదు ఉద్బవించబోయే వేరియంట్లను కూడా గుర్తించవచ్చు” అని యుటి సౌత్‌ వెస్ట్రన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement