Monday, April 29, 2024

2 వేల నోట్లతో బ్యాంక్‌లకు లాభాలు.. పెరగనున్న డిపాజిట్లు

దేశంలోని అన్ని బ్యాంక్‌ల్లో మంగళవారం నుంచి 2వేల నోట్ల మార్పిడి కార్యక్రమం ప్రారంభమైంది. 2వేల నోట్లను బ్యాంక్‌ల్లోనూ, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకునే వీలు కల్పించారు. నేరుగా కౌంటర్‌ ద్వారా కేవలం ఒకసారికి 20వేలు మాత్రమే అంటే 10 నోట్లు మాత్రమే మార్చుకునే సదుపాయం ఉంది. అందువల్ల ఎక్కువ మంది తమ ఖాతాల్లో వీటిని జమ చేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం చలామణిలో 2వేల నోట్లు 3 లక్షల 62 వేల కోట్లు ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. సెప్టెబంబర్‌ 30 నాటికి వీటిలో 2లక్షల కోట్ల వరకు బ్యాంక్‌లకు డిపాజిట్లుగా చేరతాయని భావిస్తున్నారు.

స్వల్ప కాలంలోనే భారీగా డబ్బు బ్యాంకుల్లో జమ అవుతుందని, దీని వల్ల బ్యాంక్‌ల కు ఫండ్‌ కాస్ట్‌ భారీగా తగ్గుతుందని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంచనా వేసింది. లోకాస్ట్‌ డిపాజిట్ల వల్ల బ్యాంక్‌లకు లాభదాయకత పెరుగుతుందని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్‌, బ్యాంక్‌లు రుణ రేటు, డిపాజిటల కోసం చెల్లించే మొత్తానికి మధ్య వ్యత్యాసం మార్చి 31 నాటికి తగ్గుతుంది. రుణాల డిమాండ్‌, డిపాజిట్‌ వృద్ధిని మించిపోయిందని ఫిచ్‌ రేటింగ్స్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో హెచ్చరించింది.

- Advertisement -

ఈ సంవత్సరం మే నాటికి బ్యాంక్‌ల వద్ద 18.4 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. కాని ఇప్పుడు 2వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో బ్యాంక్‌ల వద్ద డిపాజిట్లు పెరుగుతాయని, దీని వల్ల బ్యాంక్‌ మార్జిన్లు పెరుగుతాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనామిస్ట్‌ మదన్‌ సబ్నావిస్‌ అభిప్రాయపడ్డారు.

2వేల నోట్ల డిపాజిట్లు పెరగడం వల్ల కాస్ట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ తగ్గుతుందని, దీని వల్ల ఫండ్స్‌ నిర్వాహణ ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల బ్యాంక్‌ల మార్జిన్లు పెరుగుతాయన్నారు. కరెంట్‌ ఖాతా, సేవింగ్స్‌ ఖాతాల్లో డిపాజిట్లు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రజలు ప్రస్తుతం చేస్తున్న డిపాజిట్లు ఎక్కువ కాలం ఉండే అవకాశం తక్కువని, వీటిని త్వరగానే ఖాతాదారులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉందని, దీనివల్ల లాభాలు స్వల్పకాలికంగా ఉంటాయని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. స్వల్పకాలిక డిపాజి ట్ల రేట్లు ప్రస్తుతానికి తగ్గవచ్చని, మార్జిన్‌లపై పెరుగుతున్న డిపాజిట్‌ రేట్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement